జోనల్‌ వ్యవస్థను ఒప్పుకోం: లక్ష్మణ్‌  | BJP Laxman Oppose Govt Proposed Zonal System | Sakshi
Sakshi News home page

జోనల్‌ వ్యవస్థను ఒప్పుకోం: లక్ష్మణ్‌ 

May 26 2018 3:19 AM | Updated on Mar 29 2019 9:07 PM

BJP Laxman Oppose Govt Proposed Zonal System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభావితమయ్యే వర్గాలతో చర్చించకుండా వాటి పునర్వ్యవస్థీకరణ నిర్ణయం సరికాదని బీజేపీ అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, యువజన సంఘాలతో చర్చించిన తర్వాతనే జోన్లకు తుదిరూపం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర పురోగతిలో సమతౌల్యం లోపించే అవకాశం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ఫ్రీ జోనా, ఏడో జోన్‌ లేదా ఆరో జోన్‌లో భాగమా అనే అంశం తేలకనే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement