
ఓం ప్రకాశ్ రాజ్‌భర్
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ).. సీఎం యోగి ఆదిత్యనాథ్ తీరుపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది. ఎన్డీయే ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉన్నప్పటికీ.. మిత్రధర్మాన్ని పాటించకుండా తమను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆ పార్టీ నేత, యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మండిపడ్డారు. ఏప్రిల్ 10న లక్నో పర్యటనకు వస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షాతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. తమ పార్టీ లేవనెత్తిన అంశాలపై అమిత్ షా స్పందించని నేపథ్యంలో పొత్తుపై ఆలోచించుకుంటామని హెచ్చరించారు. కాగా, రాజ్‌భర్ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవని బీజేపీ పేర్కొంది.