Ballari Sriramulu Slams Karnataka CM Siddaramaiah - Sakshi
Sakshi News home page

May 7 2018 3:33 PM | Updated on May 7 2018 6:10 PM

BJ SriRamulu Slams CM Siddaramaiah - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఓడించేందుకే బాదామి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నానని బీజేపీ నేత బళ్లారి శ్రీరాములు తెలిపారు. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై  ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ఓటమి భయంతోనే 21 నెలల తర్వాత సోనియాగాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారని అన్నారు.

బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని తెలుగు ప్రజలు విజ్ఞులని, స్థానిక సమస్యల పరిష్కారానికే తెలుగు ఓటర్లు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. బీజేపీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను విభజించే కుట్రలో భాగంగానే లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని శ్రీరాములు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement