ఐపీఎల్ టికెట్ల విషయంలో కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఐపీఎల్ టికెట్లు కొనడానికి క్యూలైన్‌లో నిలబడేందుకు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు పొందనున్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఐపీఎల్ ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీంతోపాటు శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్‌కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ స్టేటస్‌లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించ నున్నట్లు తెలిపారు.
చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరిణామం జరగడానికి ఒక రోజు ముందు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలే ఇవాళ వారికి ఉచిత ఐపీఎల్ టికెట్లు రావడానికి కారణమైంది.
రాష్ట్ర ఎమ్మెల్యేలకు కేఎస్‌సీఏ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడడం ఏంటని విమర్శలకు దిగింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఉచిత టికెట్లు ఇచ్చేందుకు కేఎస్‌సీఏ ముందుకు వచ్చింది.
గతేడాది ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్‌సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో తొలుత హోం గ్రౌండ్‌ను రాయ్‌పూర్‌కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది.
#WATCH | Bengaluru: On State MLAs' demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, "...Four tickets can't be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow's… pic.twitter.com/1bA5wUNAnc
— ANI (@ANI) March 27, 2026
చదవండి: బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్!


