ఓటుకు కోట్లు కేసులో బాబును ఎందుకు వదిలేస్తున్నారు?

Bhumana Karunakar Reddy Critics On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఈ కేసులో ఇంతగా హడావుడి చేస్తున్న అదికారులకు చంద్రబాబు నాయుడు కనబడడం లేదా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌పై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివని.. అనుమానం వ్యక్తం చేశారు. 

రేవంత్‌పై ఐటీ అధికారుల దాడులపై హడావుడి చేస్తున్న ఎల్లో మీడియా.. చంద్రబాబుపై మౌనం వహించడానికి కారణాంలేటని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మతలబు ఏమిటని ప్రశ్నించారు. నేరగాడైన మఖ్యమంత్రికి శిక్షలు ఉండవా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టానికి అతీతుడా అని ధ్వజమెత్తారు. అమెరికా వెళ్లి చంద్రబాబు అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారనీ, చేయని పనులు తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

  • చంద్రబాబు భార్య పేరుమీద రూ.1200 కోట్ల ఆస్తులు ఎక్కడివి?
  • లోకేష్‌ పేరుమీద రూ.500 కోట్ల ఆస్తులు ఎక్కడివి?
  • ఓటుకు కోట్లు కేసులో ఉన్న నిందితులను హైదరాబాద్‌ వదిలి.. అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లాలని లోకేశ్‌ చెప్పారనే ప్రచారం జరుగుతుంది
  • చంద్రబాబు బినామా ఆస్తులు రేవంత్‌రెడ్డి వద్ద ఉన్నాయి.

 రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు టీడీపీ పాలకులు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి డబ్బుతోనే 23 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు మైనింగ్‌ దోపిడివల్లే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమ బలయ్యారని ధ్వజమెత్తారు.

(చదవండి: రేవంత్‌ ఇంట్లో సోదాలు)

(చదవండి : ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top