ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?

IT Raids On Cash For Vote Scam Accused Revanth And Sebastian - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓటుకు నోటు కోట్లు’  కేసులో ఏ1 రేవంత్‌ రెడ్డి, ఏ2 సెబాస్టియన్‌లు లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ దాడుల నిర్వహించింది. ఓటకు నోటు విషయంలో తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముందస్తు అంగీకారం ప్రకారం ఇచ్చిన రూ 50 లక్షలతో పాటు ఇవ్వాలనుకున్న నాలుగున్నర కోట్ల విషయంపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. రేవంత్‌ రెడ్డికి సంబంధించిన భూపాల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైనా అధికారులు తనీఖీలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ విమర్శలు వినిపిస్తున్నా తరుణంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి చేపట్టిన ఐటీ సోదాల్లో అసలు దోషులు బయటకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర, ఆడియో టేపు (బ్రీఫ్డ్‌ మీ), ఆయన డైరెక్షన్‌పై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవిలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈ నెల 13న ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఐటీ శాఖకు లేఖ రాశారు. ఏసీబీ లేఖ అందగానే ఆదాయపు పన్ను శాఖ పని ప్రారంభించింది. ( బ్రేకింగ్‌: రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు )

చంద్రబాబు నాయడు 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి తెరలేపి తన మార్కు ఫార్టీ ఫిరాయింపుల పర్వానికి తెరతీశారు. ఓటుకు నోటు కేసు మూడేళ్ళ క్రితం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ స్థాయిలో ఎంతలా హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఆ కేసు వల్లనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చాల్సివచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి  వీడియోల సాక్షిగా స్టీఫెన్ సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. 

చదవండి:

నన్ను అరెస్టు చేసేందుకు కేసీఆర్‌ కుట్ర

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top