‘రాహుల్‌, కుమారస్వామి జోకర్లు’ | Basavaraj Bommai Says Rahul Gandhi, Kumaraswamy Are Jokers | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌, కుమారస్వామి జోకర్లు’

Apr 19 2019 2:02 PM | Updated on Apr 19 2019 2:02 PM

Basavaraj Bommai Says Rahul Gandhi, Kumaraswamy Are Jokers - Sakshi

బసవరాజ్‌ బొమ్మై

కుమారస్వామి, రాహుల్‌ గాంధీ జోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్‌ బొమ్మై అన్నారు.

హుబ్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్‌ బొమ్మై అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని హీరోగా వర్ణించారు. ‘వారి(రాహుల్‌, కుమారస్వామి) నడవడిక, ఆలోచనా విధానంతో హాస్యం పండిస్తున్నారు. ఎవరు హీరో, ఎవరు జోకర్లు అనేది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తార’ని వ్యాఖ్యానించారు.

లింగాయత్‌ అంశాన్ని రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ వాడుకుంటోందని మండిపపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకోనివ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. మోదీ సర్కారును విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. మహదాయి నది వివాదాన్ని పరిష్కరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు. కర్ణాటకలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు ఈనెల 18న జరిగాయి. రెండో విడత ఎన్నికలు 23న జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement