న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది

Balli Durga Prasad said We Have Faith On Legal System - Sakshi

సాక్షి, తిరుపతి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడుని ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ తీరులతో ఇప్పటికే టీడీపీ ఖాళీ అయిపోయిందని అన్నారు. వైఎస్‌ జగన్ అశేష ప్రజానీకం ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజా నాయకుడని, చంద్రబాబు కనీసం పోరాట పటిమ లేని నాయకుడని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఆపడానికి అనేక దారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఒక్క తిరుపతి నగరంలో నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి పదేళ్ళ పైబడిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రజా సంక్షేమం.. అన్నిటినీ బాబు అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. (‘బాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు’ )

చంద్రబాబు మొదట తన పార్టీని రక్షించుకోవడం పై దృష్టి సారించాలని ఎంపీ హితవు పలికారు. సీఎం జగన్ తొమ్మిదేళ్ళ పాలన చూసిన చాలా మంది వైఎస్సార్‌సీపీలో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. తిరుపతి నా హక్కు అనే బాబు తిరుపతికి ఏమి చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజాయితీ గల అధికారులపై కక్ష్య సాధింపుకు దిగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమ పార్టీకి నమ్మకం ఉందని, న్యాయస్థానంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ఆర్జిఎస్ నిధులు నిలిపి వేయడానికి పన్నాగం పొందాడని విమర్శించారు. సొంత జిల్లాలో ఉనికిని కోల్పుతున్నాడు అనే గుబులుతో చంద్రబాబు ఏమి చేస్తున్నాడో అతనికే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.(సీఏఏ బిల్లు పేపర్లు చించేసిన ఎమ్మెల్యే)

‘వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం; శ్రీరామ్‌ అంగీకరించారు’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top