నాలుగో రోజుకు చేరిన కేజ్రీవాల్‌ నిరసన

Arvind Kejriwal Continues Protest For 4th Day While Delhi Suffocates - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీంతో ఎల్జీ ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంపై ఆప్‌ నేతలు మండిపడ్డారు. ‘కేజ్రీవాల్‌ను హౌజ్‌ అరెస్టు చేశారా?’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్‌ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అటు, ప్రధానమంత్రి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల తీరును నిరసిస్తూ.. ఎమ్మెల్యేలు, ఆప్‌ కార్యకర్తలు రాజ్‌ఘాట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘మోదీజీ ఫర్‌గివ్‌ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగింది. నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్‌ అధికారుల ఆందోళన విరమించేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top