
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు సీఎం చాంబర్ మొదటి బ్లాక్‌ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, వైఎస్సార్ సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చాంబర్ పనులను పరిశీలించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.