సభ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్‌ | AP Assembly Sessions TDP Members Walk Out From Assembly | Sakshi
Sakshi News home page

సభ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్‌

Dec 16 2019 10:28 AM | Updated on Dec 16 2019 10:55 AM

AP Assembly Sessions TDP Members Walk Out From Assembly - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోని ఇళ్ల నిర్మాణంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లుకూడా లబ్దిదారుడికి ఇవ్వలేదని మంత్రి బొత్స తెలిపారు. సభలో టీడీపీ అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆదరాబాదరాగా ఇళ్లు కట్టించిందని విమర్శించారు. లబ్దిదారులను తొలగించామన్న మాటల్లో నిజం లేదని అన్నారు. ఆధునిక పరిఙ్ఞానంతో ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కాగా, గృహ నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌పై ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం చెప్తుండగా..తమకు మాట్లాడే అవకాశం కావాలంటూ టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లారు. వారిని స్పీకర్‌ అనుమతించకపోవడంతో వాకౌట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement