'చట్టం అనేది అందరికి సమానమే'

Anil Kumar Fires On TDP About Atchannaidu Arrest In Legislative Council - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ బడ్జెట్‌ రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌‌ ధీటుగా సమాధానమిచ్చారు. అచ్చెనాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సభ్యులు క్రికెట్‌ బెట్టింగ్‌ అంశాన్నిలేవనెత్తారు. దీనిపై అనిల్‌ స్పందిస్తూ..' చట్టం అనేది అందరికి సమానమే... రూ. 150 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. బీసీ అయితే అరెస్ట్‌ చేయకుడదా.. 300 మంది పోలీసులతో అచ్చెనాయుడును అరెస్ట్‌ చేయడానికి వెళ్లారని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అచ్చెనాయుడు దొంగ లాగా ఇంట్లో దాక్కుని తాళాలు వేసుకుంటే పోలీసులే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.(ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం)

కాపు ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముద్రగడ ఇంటికి మూడువేల మందిని పంపి భయానక వాతావరణం సృష్టించారు. అంతేగాక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మహిళలపై అమానుషంగా దాడులు చేశారు. నాపై గత ప్రభుత్వం క్రికెట్‌ బెట్టింగ్‌ విషయంలో నోటీసులు ఇచ్చిన మాట నిజమే. కానీ నేను ధైర్యంగా విచారణకు హాజరయ్యాను. ఈ వ్యవహారంలో నాకు క్లీన్‌చిట్ లభించింది. ఆ సమయంలో నోటీసులు ఇచ్చి నా ఇమేజ్‌ డామేజ్‌ చేయడానికి ప్రయత్నం చేశారు' అంటూ పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top