అఖిలేశ్‌తో బూట్లు విప్పించారు!

Akhilesh is Made to Take Off Shoes Before Meeting Mayawati, Says Yogi - Sakshi

లక్నో: ‘ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమిలో అఖిలేశ్‌ యాదవ్‌కు తగిన ప్రాధాన్యమే లేదు. కూటమి అధిపతిగా మొత్తం మాయావతే చక్రం తిప్పుతున్నారు. వేదిక మీద కలిసి కూర్చునే సమయంలోనూ మాయవతికి పెద్ద కూర్చీ వేస్తుండగా అఖిలేశ్‌ను చిన్న కూర్చీలో కూర్చోబెడుతున్నారు. ఇక, మాయావతిని కలిసేందుకు వెళితే.. బూట్లూ విప్పాకే లోపలికి రావాలంటూ అఖిలేశ్‌కు చెప్తున్నారు. ఇది కూటమిలో ఆయన పోజిషన్‌’ అంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజాగా విరుచుకుపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ చేతులు కలిపి కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కూటమిలో అఖిలేశ్‌కు తగిన పట్టు లేదని, చివరికీ మాయావతిని కలిసేందుకు వెళ్లినా.. ఆయనతో బూట్లు విపిస్తున్నారని తాజాగా ఏఎన్‌ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన యోగి విమర్శించారు. కూటమిలో సీట్ల పంపకాల విషయంలోనూ ఎస్పీ సుప్రీం ములాయంసింగ్‌ యాదవ్‌ కూడా అసంతృప్తితో ఉన్న విషయాన్ని యోగి ప్రస్తావించారు. బీఎస్పీ కన్నా ఎస్పీకి ఎక్కువ సీట్లు దక్కాల్సి ఉండేదని, కానీ, సీట్ల పంపకాల్లో తన కొడుకుకు మాయావతి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ములాయం మండిపడుతున్నారని యోగి చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top