అగ్రిగోల్డ్‌ బాధితుల పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం | Agrigold Victims List Preparation Started By Lella Appi Reddy | Sakshi
Sakshi News home page

Jan 17 2019 2:08 PM | Updated on Jan 17 2019 2:34 PM

Agrigold Victims List Preparation Started By Lella Appi Reddy - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం బాధితుల పేర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితుల లెక్కలను తగ్గించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. పోలీసుల సర్వేలో 19లక్షల 50వేల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నట్టు తేలిందని.. కానీ ప్రభుత్వం ముందే 10లక్షల మంది మాత్రమే ఉందని చెప్పడం అన్యాయమని అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement