టీడీపీలో ప్రకంపనలు

Adinarayana Reddy Comments on MPs Resignations - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏంచేయాలో దిక్కుతోచక టీడీపీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేసేందుకు టీడీపీ సిద్ధమా అని వైఎస్‌ జగన్‌ గురువారం సవాల్‌ విసిరారు.

దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ తమ ఎంపీలు కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. గంట కూడా గడవకముందే మాట మార్చారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. గంట వ్యవధిలో రెండుసార్లు మీడియా ముందుకు వచ్చిన మంత్రి ఆది ఏం మాట్లాడారో చూద్దాం.

సాయంత్రం 6 గంటలకు ఆది కామెంట్స్‌..

  • వైఎస్సార్‌సీపీ ఎంపీల కంటే ముందు మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం
  • రాజీనామాల్లో టీడీపీదే ప్రీ షెడ్యూల్
  • వైఎస్సార్‌సీపీ డెడ్‌లైన్ ఏప్రిల్ 6 అయితే మాది మార్చి 5
  • పార్లమెంట్‌లో కేంద్రం ఏపీకి అనుకూల ప్రకటన చేయకపోతే ఆరోజే మా కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారు
  • అదేరోజు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటాము
  • 19 అంశాలు కేంద్రం ముందుంచాం, ఒక్కటి చేయకపోయినా అదే పొత్తుకు చివరిరోజు

రాత్రి 7 గంటలకు ఆది కామెంట్స్‌..

  • మార్చి 5 రాజీనామాలకు డెడ్‌లైన్‌ అన్నది పార్టీ నిర్ణయం కాదు
  • నా వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు
  • ఇది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top