ఏం జరిగిందో?: మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... | Lady Doctor Commits Suicide Over ‘In-Laws’ Torture’ | Sakshi
Sakshi News home page

ఏం జరిగిందో?: మహిళా వైద్యురాలు ఆత్మహత్య ...

Aug 18 2018 2:08 PM | Updated on Aug 18 2018 5:00 PM

Lady Doctor Commits Suicide Over ‘In-Laws’ Torture’ - Sakshi

మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్య

బరంపురం: జిల్లా కేంద్రంలోని చత్రపూర్‌ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్‌పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని    పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

వివరాలిలా ఉన్నాయి..
చత్రపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని తురాయి పట్టపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రఘునాథ్‌దాస్‌ కుమార్తె అర్చనాదాస్‌గా మృతురాలిని పోలీసులు గుర్తించారు. నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్‌లోని గడిఖానా ప్రాంతానికి చెందిన వైద్యుడు అర్జున్‌దాస్‌తో ఆమెకు వివాహం జరిగింది. అర్చనాదాస్‌ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. కొన్నాళ్ల నుంచి భర్త అర్జున్‌దాస్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా గంజాం జిల్లాలోని తురాయి పట్టపూర్‌ గ్రామంలో తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. అర్చనాదాస్‌ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement