తల కొరివి - పాద కొరివి | Two brothers fight to creamte their mother after her death | Sakshi
Sakshi News home page

తల కొరివి - పాద కొరివి

Nov 1 2014 12:21 AM | Updated on Sep 2 2017 3:39 PM

తల కొరివి - పాద కొరివి

తల కొరివి - పాద కొరివి

‘‘దీన్ని ‘యసిరొ ఫోబియా’ అంటారు.

‘‘దీన్ని ‘యసిరొ ఫోబియా’ అంటారు. ఇంగ్లీషులో పేరుందిగాని, నీకది అనవసరం. మాదేం లేదు. పేపర్లకి, టీవీలకి, ఇతర భోగట్టా వ్యవస్థలకి దూరంగా ఉండు. కొన్నాళ్లు ప్రవచనాలు మాత్రం సేవించు’’ అంటూ సాగనంపాడు. చిత్రం! అప్పుడు నా మైండ్‌లో తిరునామం హైవోల్టేజీ కరెంటు బల్బులతో వెలిగింది.
 
అక్షర తూణీరం
అగస్త్య మహర్షికి ఆ రో జుల్లో పెద్ద పేరు. సము ద్రాలన్నిటినీ ఆపోశన పట్టే శాడని చెబుతారు. ఆయనకో తమ్ముడు న్నాడు. అందరూ ఆయ నని అగస్త్య భ్రాత అని పిలిచేవారు. అంటే అగ స్త్యులవారి తమ్ముడని. తనకంటూ ఒక పేరూ ప్రతిష్ట లేనందుకు ఆ తమ్ముడు చాలా బాధపడుతూ ఉండేవాడు. అగస్త్య భ్రాత- తద్దినం పెట్టేవాడి తమ్ముడు. ఇదొక సామెతలాగా ప్రచారంలోకి వచ్చింది. ఇలాగే మా ఊళ్లో ఇద్దరు బ్రదర్స్ గొడవపడ్డారు.

తల్లి చనిపోతే తలకొరివి పెట్టడానికి అన్న ప్రదక్షిణలు చేస్తున్నాడు. తమ్ముడు కూడా ఎదురు ప్రదక్షిణలు మొదలు పెట్టి పాద కొరివి పెట్టడానికి సిద్ధపడ్డాడు. పెద్దలు వారించారు. ఇది ఊరికి అరిష్టం, పాద కొరివి మన సంప్రదాయంలో లేదన్నారు. పాపం, ఏ కళనున్నాడో ఆ ప్రయత్నాన్ని విరమించుకు న్నాడు. అస్థికలలో మాత్రం తన వాటా తనకి వేరే పిడతలో ఇవ్వాలని తల్లి కపాల మోక్షానికి ముందే పెద్దలతో మాట తీసుకున్నాడు. నాలుగో రోజు, ‘‘అస్తమానం వాడి చేతి కింద నేను చెయ్యి పెట్టాల్సివస్తోంది. నాకొద్దు. నా దినం నేనే చేసుకుం టా! నా తద్దినం నేనే పెట్టుకుంటా! వాడి తద్దినం వాడే!’’ అంటూ వేర్లు పడ్డారు.  ఔనూ... ఇది ఎప్పు డో నా చిన్నప్పుడు మా ఊళ్లో జరిగిన ఘటన. నాకి ప్పుడెందుకు గుర్తొచ్చింది? ఏమో, గుర్తురావడం లేదు.

ఈ మధ్య ఇలాగే అసంబద్ధంగా, అసం దర్భంగా ఏవేవో బుర్రలోకి వచ్చి గట్టిగా నిలబ డుతున్నాయి. అడ్రసు, సెల్ నంబర్ లాంటి వాటికి చోటు మిగలడం లేదు. పోనీ, ఓసారి డిలీట్ చేస్తారేమోనని సైకాలజీ తెలిసిన డాక్టరు మిత్రుణ్ణి సంప్రదించాను. ‘‘వస్తుంది, అలాగే వస్తుంది. అరవై దాటాక చాలా సహజం’’ అంటూ ఓదార్చాడు. ‘‘అందరి కీనా?’’ అని అడిగాను. అప్పటికే ల్యాప్‌టాప్ ఆన్ చేసి అందులో ఉన్నాడు. అందరికీనా అని అడిగితే చెప్పలేను కానీ, నీలాంటి పనికిమాలిన ప్రొఫె షన్‌లో ఉన్నవాళ్లకి సహజం. ఎంతమాట! ‘‘ నా భావోద్రేకాలను కించపరచవద్దు. ప్లీజ్!’’ అన్నాను. ఆ డాక్టరు కనీసం నా వైపన్నా చూడకుండా, ఉద్రే కాలు కాదు, ఉద్వేగాలు... చూడండి, అంటూ ల్యాప్ టాప్‌లో ఊడలమర్రి బొమ్మని చూపించాడు. దీన్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? అన్నాడు. ‘‘గుమ్మడి కాయ’’ అన్నాను. చూశారా! అదే మానవ మేధ యొక్క మిస్టరీ అని నవ్వాడు.

చిన్నప్పుడు మర్రి నీడన విశ్రమించిన బాటసారి మర్రికాయలు ఇంత చిన్నవేమిటి? తీగెకి కాసే గుమ్మడికాయలంత పెద్దవే మిటని దేవుణ్ణి చూసి నవ్వుకున్న కథ మీకిప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఔను డాక్టర్! కరెక్ట్‌గా చెప్పారు. నాకు టీవీలో మహా పాత సినిమా చూసేప్పుడు నల్లులు గుర్తుకువస్తాయి. అనగానే, ఆయన అందు కుని, ‘‘ఎందుకంటే మీరా సినిమాని మీ చిన్నప్పుడు మీ ఊరి టెంట్ హాల్లో చూశారు. అప్పుడు మీరు నల్లులతో కలసి చూశారు’’ అంజనం వేసినట్టు నా మైండ్‌ని చూసేస్తున్నాడు. అయినా‘‘నువ్వు నా వృత్తిని గాయపరిచే విధంగా కామెంట్ చేశావ్!’’ అనడానికి నేను వెనుకాడలేదు. ల్యాప్‌టాప్‌లోంచి వ్యంగ్య ధోరణితో నా వంక చూశాడు.

‘‘ఒక టీచర్‌లా విద్యాబుద్ధులు గరప లేరు. డాక్టరులా రోగాలు బాపలేరు. లాయ ర్‌లా న్యాయాన్యాయాలకు వకాల్తా పుచ్చుకోలేరు. ఇంజ నీరులా ప్లాను వెయ్యలేరు. ఆడిటర్‌లా అస్సలు చెయ్యలేరు. పొలిటీషియన్‌లా అరచే తిలో హరివి ల్లుని ఆవిష్కరించలేరు. సినిమా స్టార్‌లా జన బాహుళ్యాన్ని వినోద పరచలేరు. మైకు ముందు కొచ్చి ఆఖరికి వందన సమర్పణ కూడా సరిగ్గా అఘోరించలేరు. పోనీ గృహస్తులా సకాలంలో ఇంటికెళ్లి సంసార జీవితం గడప గలిగారా అంటే, అదీ లేదు. కోడిలా గుడ్డు పెట్ట లేరు. గొర్రెలా బొచ్చు ఇవ్వలేరు. ఏమిటండీ గోం గూరు... ఉన్నమాటంటే నీకంత రోషం!’’ మొత్తం ఒక్క గుక్కలో అనేసి చక్కా ఊరుకున్నాడు. పైగా బహువచనం. అంటే మొత్తం నా జాతిని సం బోధించాడన్నమాట. అసలు సమస్యకు, ఈ పనికి మాలిన స్టేట్‌మెంట్‌కి ఏ మాత్రం సంబంధం లేదు. ఇదొక మానసిక వైక్లబ్యం అనుకుని సరి పెట్టుకున్నాను.

ఇంతకూ నాకు తద్దినం పెట్టేవాడి తమ్ముడు ఎందుకు గుర్తొస్తున్నాడో, దానికి మందేమిటో చెప్పా వు కాదు అన్నాను. ‘‘దీన్ని ‘యసిరొ ఫోబియా’ అం టారు. ఇంగ్లీషులో పేరుందిగాని, నీకది అనవసరం. మాదేం లేదు. పేపర్లకి, టీవీలకి, ఇతర భోగట్టా వ్యవస్థలకి దూరంగా ఉండు. కొన్నాళ్లు ప్రవచనాలు మాత్రం సేవించు’’ అంటూ సాగనంపాడు. చిత్రం! అప్పుడు నా మైండ్‌లో తిరునామం హైవోల్టేజీ కరెం టు బల్బులతో వెలిగింది.

(వ్యాసకర్త ప్రముఖ రచయిత)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement