పెన్నూ, గన్నయి పేలిన సుబ్బారావు పాణిగ్రాహి

పెన్నూ, గన్నయి పేలిన సుబ్బారావు పాణిగ్రాహి


‘దిక్కుమొక్కు లేని జనం ఒక్కొ క్కరు అగ్నికణం.. సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి’ అంటూ తన పాటల్ని విప్లవ రాజ కీయాలతో జోడించిన ప్రజా కవి సుబ్బారావు పాణిగ్రాహి. 1934 సెప్టెంబర్ 8న శ్రీకా కుళం జిల్లా బారువాలో ఒక పూజారి కుటుం బంలో జన్మించాడు. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. తామాడ గణపతి, పంచాది క్రిష్ణమూర్తితో కలసి యువకులను ఉద్యమాల్లోకి తెచ్చాడు. తెగింపు సంఘాన్ని పెట్టి ఎందరో యువకులను శ్రీకాకుళ పోరాటంలోకి తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలపై  ఎన్నో పాటలను, గేయాలను, నాటికలను రాశాడు. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ వంటి ఆయన రాసిన పాటలు శాశ్వతంగా నిలిచి పోయాయి. తామాడ చినబాబుతో కలిసి ఆయన చెప్పిన జముకుల కథ ప్రజలను ఉర్రూతలూపింది. ఆయన రాసిన ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్’ అనే పాట విప్లవకారులు నిత్యం జెండా వందన వేళ పాడుకునే విప్లవగీతం అయింది.

 

శ్రీకాకుళ గిరిజనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొ న్నాడు. చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి అమరత్వం తర్వాత సోంపేట ఏరియా పార్టీ కార్యద ర్శిగా పాణిగ్రాహిని ఎన్నుకున్నారు. అనతి కాలంలో నే అంటే, 1969 డిసెంబర్ 22న పాణిగ్రాహిని రంగమటియ కొండల్లో కాల్చి చంపారు. ఆయన జీవించింది 36 ఏళ్లు మాత్రమే. ప్రజాకళలకు జీవం పోసి వాటిని రాజకీయాలతో జోడించి ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. గిరిజనులను నిర్వాసితుల ను చేస్తూ, ప్రజాకళల పోషణ పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ సంస్థల ద్విముఖ దాడిపై కళాకా రులు నేడు ఉద్యమించాలి.. పాణిగ్రాహి లాగా వారి విముక్తి కోసం పనిచేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. అందుకే పాణిగ్రాహిని స్మరించుకుందాం.

 


(నేడు సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి)

సి.వెంకటేశ్వర్లు  సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top