
నాన్–ఆల్కహాల్ వైపు సోషల్ డ్రింకింగ్ కల్చర్
మాక్‌టెయిల్స్‌కు మిలీనియల్స్, జెన్–జీ చీర్స్
మారుతున్న పట్టణ యువత ఆలోచనా ధోరణి
అసలే యూత్.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్ (29–44 సంవత్సరాల వయసు), జెన్–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్ లేని లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది. సరదాగా గడిపేందుకు ఆల్కహాల్ మాత్రమే పరిష్కారం కాదన్నది యువతరం మాట.
సోషల్ డ్రింకింగ్ కల్చర్ భారత్‌లో క్రమంగా మారుతోంది. నీల్సన్‌ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాలుపంచుకున్న భారతీయ వినియోగదారుల్లో 24% మంది ఆల్కహాల్ రహిత లేదా తక్కువ ఆల్కహాల్ ప్రత్యామ్నాయాలను ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 17% ఉంది. ఆల్కహాల్ రహిత లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను తీసుకుంటున్నవారిలో సగానికి పైగా జెన్–జీ, మిలీనియల్స్ ఉన్నారు. ఫిలిప్పీన్్స తర్వాత ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి మాక్‌టెయిల్స్‌కు (ఆల్కహాల్ రహిత పానీయాలు) భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. మనదేశంలో ఉత్తరాదిలో దాదాపు 54% మంది, తూర్పు భారతంలో 50%, పశ్చిమాన 43%, దక్షిణాన 37% మంది ఆల్కహాల్ పానీయాలను ఇష్టపడుతున్నారని నివేదిక తెలిపింది.
ట్రెండ్‌గా మారుతోంది
సాంస్కృతిక, సామాజిక వైఖరుల్లో వస్తున్న మార్పులు దేశంలో మద్యపాన రహిత జీవనశైలికి మార్గం సుగమం చేస్తు న్నాయి. మద్యపానానికి దూరంగా ఉండటం అనేది గతంలో మతపరమైన లేదా ఆరోగ్య కారణాలతో ముడిపడి ఉండేది. ప్రస్తుతం ట్రెండ్‌గా మారుతోంది. ఏం తీసుకుంటు న్నాం, వాటి ప్రభావం ఏమిటో తెలుసుకుని మరీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మిలీనియల్స్, నిపుణులు, పట్టణ వినియోగదారుల నుంచి ఆల్కహాల్ రహిత పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ బీర్ అనుభవాన్ని రాజీ పడకుండా మెట్రోలలో ఈ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీలు కూడా నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయి.
జీబ్రా స్ట్రిప్పింగ్ ట్రెండ్
జెన్–జీ అంటేనే సరికొత్త కోరికలు, ఆవి ష్కరణలకు పెట్టింది పేరు. వారు ఇటీవలి కాలంలో జీబ్రా స్ట్రిప్పింగ్ ట్రెండ్‌ను ఎక్కువ గా అనుసరిస్తున్నారు. అంటే ప్రతి ఆల్కహా లిక్ డ్రింక్ తర్వాత ఆల్కహాల్ రహిత పానీ యాలను తీసుకుంటున్నారు. యూత్ ఎక్కు వగా కాక్‌టెయిల్స్, ప్రీమియం డ్రింక్స్ తాగు తున్నారు. విలువ పరంగా చూస్తే వీటి విలు వ ఎక్కువే కావడం గమనార్హం. అందుకే, కొన్ని కంపెనీలు ఆల్కహాల్ లేని పానీయా ల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.
ఆల్కహాల్ రహితంవైపు..
నీల్సన్ఐక్యూ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 53% మంది పూర్తిగా తాగనివారు లేదా చాలా తక్కువ తాగేవారు.. చట్టబద్ధంగా తాగే వయస్సు కలిగి ఉన్నారు. అంటే.. వీళ్లంతా 18–34 ఏళ్ల లోపు వారన్నమాట. ఇక, ఈ కేటగిరీలో ఉన్న 35–54 ఏళ్లవారు 35 శాతం కాగా, 55 ఏళ్లకుపైబడిన వారు 13 శాతం. ఆల్కహాల్ రహిత పానీయాల వైపు యువత ఆకర్షితులవుతుండటంతో ఈ మార్కెట్ దేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.
ప్రధానంగా ఈ ట్రెండ్ మెట్రోల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ లభ్యత గతంలో చాలా పరిమితంగా ఉండేది. ప్రస్తుతం ఇవి విరివిగా లభిస్తుండడం సైతం డిమాండ్‌కు ఆజ్యం పోస్తోంది. పైగా క్విక్ కామర్స్ కంపెనీలు వీటిని నేరుగా కస్టమర్లకు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. హైదరాబాద్, గోవా, బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్‌లోని బార్లు సరికొత్త మాక్‌టెయిల్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. కోలా పానీయాలు, తాజా లైమ్ సోడా, మొహిటో వంటి ఆల్కహాల్ రహిత పానీ యాలు మెనూలో వెనుక భాగంలో ఉండే రోజులు పోయాయన్నది మార్కెట్ వర్గాల మాట.