అప్పుడొక మాట ఇప్పుడొక మాట | KCR changes his word on Ramoji film city | Sakshi
Sakshi News home page

అప్పుడొక మాట ఇప్పుడొక మాట

Feb 1 2015 1:28 AM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ సర్కార్ వస్తే రామోజీ ఫిలింసిటీని 100 ట్రాక్టర్లతో దున్ని ఆ స్థలాలను ప్రజలకు పంచుతానన్న టీఆర్‌ఎస్ అధినేత..

తెలంగాణ సర్కార్ వస్తే రామోజీ ఫిలింసిటీని 100 ట్రాక్టర్లతో దున్ని ఆ స్థలాలను ప్రజలకు పంచుతానన్న టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామోజీని ఇంద్రుడు, చంద్రు డని ఎందుకు పొగుడుతున్నారో అర్థంకావడం లేదు. ఆంధ్రోళ్ల పై మాకు ఎలాంటి కోపం లేదన్న కేసీఆర్ ఆంధ్రోళ్లు ఏం పా పం చేశారని విభజనకు పాల్పడ్డారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉన్న కర్నూలును హైదరాబాద్ చేస్తే నాడు ఎవరూ అడ్డు చెప్పలేదు. అప్పుడేమో విభజన పోరాటం చేసి ఇప్పుడు మాత్రం ఆంధ్ర వాది రామోజీని పొగుడుతున్నారు.
 
 తెలంగాణ సర్కారు వస్తే దళితుడిని సీఎంని చేస్తానన్న మీరు మాట మరచి సీఎంగా  ఆ సీటుపై కూర్చొని, రామోజీ ఫిలిం సిటీపై నేను ఏ రోజూ మాట అనలేదు అన్నారు. దానిని వంద ట్రాక్టర్లతో దున్ని స్తానని మీరు అన్నట్లు అన్ని పత్రికలలో వచ్చినప్పుడు ఎందుకు కౌంటర్ చేయలేదు. మీ మాటలను ఖండిస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీని సందర్శించనిస్తే రామోజీ పవిత్రుడు అయిపోయా రా? రామోజీ ఫిలిం సిటీ భూములు అన్నీ పేద ప్రజల భూము లు కనుకనే కోర్టులో కేసు నడుస్తున్నాయి. సీఎం చంద్రశేఖ రరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
 - కె.త్రివేణి  అమీర్‌పేట, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement