
ఈవెంట్
పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో, మహాశ్వేతాదేవి స్మరణలో ఒక సాహిత్య సభ ఆగస్టు 7న మధ్యాహ్నం 2 గంటలకు టీఎన్జీవో భవనం, మహబూబ్‌నగర్‌లో జరగనుంది.
ఈవెంట్
సత్య శ్రీనివాస్ ఎగ్జిబిషన్
సత్య శ్రీనివాస్ mothers and grannies పొర్ట్రెయిట్స్ ఎగ్జిబిషన్ 20 memories ఆగస్టు 5న సాయంత్రం 6:30కు ప్రారంభం కానుంది. ప్రారంభకులు: అల్లం నారాయణ. వేదిక: గెథె-జెంత్రమ్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నం.3, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈ ప్రదర్శన ఆగస్టు 13 వరకు ఉంటుంది.
మహాశ్వేతాదేవి సంతాప సభలు
పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో, మహాశ్వేతాదేవి స్మరణలో ఒక సాహిత్య సభ ఆగస్టు 7న మధ్యాహ్నం 2 గంటలకు టీఎన్జీవో భవనం, మహబూబ్‌నగర్‌లో జరగనుంది. మహాశ్వేతాదేవి జీవితం- సాహిత్యాన్ని గూడూరు మనోజ వివరిస్తారు. మహాశ్వేత రచనలు బషాయిటుడు(ఉదయమిత్ర), ఒక తల్లి(ఎం.డి.ఇక్బాల్‌పాషా), ఎవరిదీ అడవి(కె.సి.వెంకటేశ్వర్లు), కథలు(పరిమళ్), రాకాసికోర(ఎం.రాఘవాచారి) పరిచయాలు కూడా ఉంటాయి.
‘జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, సామాన్యుల, గిరిజనుల జీవన స్థితిగతులను చైతన్యస్ఫోరకంగా చిత్రించిన’ మహాశ్వేతాదేవి సంతాప సభ మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆగస్ట్ 9న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో జరగనుందని సంఘం ప్రధాన కార్యదర్శి తైదల అంజయ్య తెలియజేస్తున్నారు. ఇందులో కాత్యాయనీ విద్మహే, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు.
దేశభక్తి గీతాల, కవితల పోటీ
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు దేశభక్తి గీతాల, కవితల పోటీ నిర్వహిస్తున్నారు. పది వేల రూపాయల నగదు బహుమతులిచ్చే ఈ పోటీకి స్వాతంత్య్రోద్యమం, స్వాతంత్య్ర దినోత్సవం, సైనికుల త్యాగాలు, ఉగ్రవాద నిర్మూలన, శాంతి స్థాపన, జాతీయ సమైక్యత, మువ్వన్నెల జెండా అనే అంశాలపై రాయవలసివుంటుంది. ‘డిక్లరేషన్’ సహా రచనలు చేరవలసిన ఆఖరి తేదీ: ఆగస్ట్ 15. చిరునామా: ఎస్.నరేందర్‌రెడ్డి, 19-457/1, రాంనగర్, మంచిర్యాల-504208. ఫోన్: 9440383277. మెయిల్: potriots welfare society@ gmail.com
2016 గడియారం అవార్డుకై...
రచన సాహిత్య వేదిక, కడప వారు ‘మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి అవార్డు’ కోసం 2012 నుండి ప్రథమ ముద్రణ పొందిన పద్యకావ్యాలను ఆహ్వానిస్తున్నారు. కావ్యం ఒకే కవి కృతమై ఉండాలి. ఖండకావ్యాలు పంపవచ్చు. ఎంపికైన కావ్యానికి ఐదు వేల నగదు బహుమానం ఉంటుంది. కవులు తమ కావ్యపు నాలుగు ప్రతుల్ని ‘ఎన్.సి.రామసుబ్బారెడ్డి, కార్యదర్శి, 7/201-3ఇ, జయనగర్ కాలనీ, కడప-516002’ అన్న చిరునామాకు ఆగస్టు 20లోగా పంపాలి.
జాగృతి కథల పోటీకి ఆహ్వానం
జాగృతి వారపత్రిక వారు వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తున్నారు. భారతీయ సమాజ జీవనంతో కూడిన సమకాలీనం, చారిత్రకం, సామాజిక ఇతివృత్తంతో 1500 పదాలకు మించకుండా కథలు పంపాలని కథకులను కోరుతున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 15 వేలు, 10 వేలు, 6 వేలు. జాగృతి వారపత్రిక, కాచిగూడ, హైదరాబాద్-27కు పోస్టు చేయొచ్చు. చివరి తేది: ఆగస్టు 30. మరిన్ని వివరాలకు: 9959997204