కార్పొరేట్‌కు వరాల జల్లు | budjet only use for corpotate | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు వరాల జల్లు

Mar 3 2015 12:49 AM | Updated on Sep 2 2017 10:11 PM

జైట్లీ బడ్జెట్ జన జీవితాలను జటిలం చేసేదిగానూ, కార్పొరేట్ వర్గా లకు వరాల జల్లు కురిపించేదిగానూ ఉంది.

జైట్లీ బడ్జెట్ జన జీవితాలను జటిలం చేసేదిగానూ, కార్పొరేట్ వర్గా లకు వరాల జల్లు కురిపించేదిగానూ ఉంది. ప్రస్తుతం దేశ పరిస్థితి బాగుందని సర్వేలో తేల్చారు. ఇక సరైన ప్రణాళికతో అభివృద్ధి దిశగా పరుగులు తీయడమే తరువాయి అని చెప్పారు. అయితే అన్ని సాను కూలతలను ఉపయోగించుకుని సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధించే దిశ గా బడ్జెట్‌ని మలచలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందంటూనే, సరైన చేయూతనిచ్చే ప్రయత్నం చేయ లేదు. స్థూలజాతీయోత్పత్తిలో 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రంగానికి జరిపిన కేటాయింపులు, రైతుల బాధల్ని తొలగించే ప్రణాళి కలూ తూతూమంత్రాలే. వేతనదారులకు పన్ను నొప్పి నివారణా చర్య లు శూన్యం. సేవలపన్ను పెంచడం ద్వారా సామాన్యుడి జేబుకి చిల్లు ల్ని పెద్దవి చేశారు. ప్రపంచ ఆకలి పస్తుల జనాభాలో సగం మంది ఉన్న దేశంలో వారి ఆకల్ని తగ్గించే మార్గాలకు కేటాయింపులు కానీ, ఉపాధి హామీ పథకం లాంటి ఉపశమన మార్గాలకు భారీ చేయూతగానీ లేదు. మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకునే రీతిలో విద్యా, ఆరో గ్యాలకు, వైద్యానికి పెద్దపీట వేస్తే బాగుండేది. ఆర్థిక క్రమశిక్షణ అంటే సంక్షేమానికి కోత పెట్టడమే అన్న ప్రభుత్వ ఆలోచన అనాగరికం. కార్పొరేట్ వర్గాలకు వరాల జల్లు కురిపించి, కాలే కడుపుల్ని విస్మరిం చడం దారుణం.
 డా. డి.వి.జి శంకరరావు  మాజీ ఎంపీ, పార్వతీపురం

Advertisement
 
Advertisement
Advertisement