టెక్సాస్‌లో ‘యాత్ర’ను వీక్షించిన అభిమానులు | YSR Followers Watched Yatra Movie In Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో ‘యాత్ర’ను వీక్షించిన అభిమానులు

Feb 12 2019 2:29 PM | Updated on Feb 12 2019 2:44 PM

YSR Followers Watched Yatra Movie In Texas - Sakshi

టెక్సాస్‌ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. యాత్ర సినిమా విడుదలని ప్రపంచ వ్యాప్తంగావైఎస్సార్ అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకొంటున్నారు. యాత్రను చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. 

పాద‌యాత్ర‌లో భాగంగా నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌తో త‌న అనుబంధాన్ని ఎలా ఏర్ప‌ర్చుకున్నారనే విష‌యాన్ని.. ద‌ర్శ‌కుడు చాలా ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించార‌ని చెప్పారు. మహి వి రాఘవ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఒక మంచి భావోద్వేగ కథను చక్కగా చూపించారని  అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వైఎస్ అభిమానుల‌కే కాకుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే విధంగా తీశారని చెప్పారు. ఇక మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్సార్ ని మళ్ళీ చూసిన అనుభూతి కలిగిందని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

టెక్సాస్ రాష్ట్రం సాన్ఆంటోనియో నగరంలోని వైఎస్సార్ అభిమానులు వేణుగోపాల్ రెడ్డి కొత్తపల్లి, ఆదినారాయణ రెడ్డి లక్కు, సునీల్ కుమార్ రెడ్డి మేడ, రెడ్డి భాస్కర్ రెడ్డి బండ్లపల్లి, రాజశేఖర్ రెడ్డి , నవీన్ చిల్లా, సాయి ప్రసాద్ , శరణ్య అరికట్ల, వెంకట రామాంజనేయ రెడ్డి, జయరాం రెడ్డి, భార్గవ్ రెడ్డి బూడిదేటి, శివ , నియంత్, అశోక్ రెడ్డి అన్నపురెడ్డి , కిషోర్ రెడ్డి అన్నపురెడ్డి తదితరులు యాత్ర సినిమాను వీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement