లండన్‌లో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు | Ys Jagan Birth Day Celebrations held in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

Dec 19 2018 8:24 PM | Updated on Dec 19 2018 8:27 PM

Ys Jagan Birth Day Celebrations held in London - Sakshi

వైఎస్సార్‌సీపీ యూకే, యూరోప్‌ వింగ్‌ కన్వీనర్‌ సందీప్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి.

లండన్‌ : వైఎస్సార్‌సీపీ యూకే, యూరోప్‌ వింగ్‌ కన్వీనర్‌ సందీప్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ యూకే, యూరోప్‌ సభ్యులు తమ కుటుంబసభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. డిసెంబర్‌ 21న వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు కాగా, లండన్‌లోని ఈస్ట్‌ హమ్‌లోని హైదరాబాద్‌ పారడైజ్‌ రెస్టారెంట్‌లో ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అండగా నిలిస్తామని ఎన్‌ఆర్‌ఐలు తెలిపారు.  ఏపీలో వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనంటూ జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement