సీటెల్‌లో ఘనంగా దసరా సంబరాలు

WATG Bathukamma celebrations held in Seattle - Sakshi

సీటెల్‌ : వాషింగ్టన్‌ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. సీటెల్‌లోని తెలుగు వారు బెల్లెవులే హై స్కూల్‌లో బతుకమ్మ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. సీటెల్ ప్రాంతానికి చెందిన దాదాపు వేయి మంది తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపడుచులు అందమైన పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ వస్త్రాధరణలో బతుకమ్మ పాటలు ఆడి పాడారు. ఈ కార్యకమంలో తెలంగాణ సింగర్ మధు ప్రియ, బాహుబలి సింగర్ సత్య యామిని తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. 

ఈసారి సీటెల్ తెలుగు వాళ్లు అతి పెద్ద బతుకమ్మను పేర్చి ఉరేగింపుగా తీసుకువచ్చారు. ప్రతి ఏడాది సామాజిక సేవ చేసే తెలంగాణ మహిళలకు 'వుమెన్‌ అఫ్ ది ఇయర్' అవార్డును తెలంగాణ అసోసియేషన్‌ అందించింది. 2018 ఏడాదికి గానూ వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు అరవిందరెడ్డికి సీ2ఎస్‌ ఛైర్మన్‌ జగన్‌ చిట్టిప్రోలు చేతుల మీదుగా ఇచ్చారు. బోర్డు మెంబెర్స్  రాజ్, సూర్యప్రకాష్ రెడ్డి, సంగీతా రెడ్డి , శ్రీధర్, రాజా, రామ్, సాయి, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు జరిగాయి.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top