లండన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు 

UKTA Celebrated Sankranthi Festival In London - Sakshi

లండన్ : యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యం లో తొమ్మిదవ సంక్రాంతి వేడుకలు ఈస్ట్ లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా  SBI బ్యాంకు ప్రతినిధి తులా శ్రీనివాస్ విచ్చేశారు. సంస్కృతి సంప్రదాయాల గురించి ముందు తరాలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. 

స్త్రీలకు ముగ్గు పోటీలు, చిన్న పిల్లలకు భోగి పళ్ళు, ఫ్యాన్సీ డ్రెస్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో ఆద్యంతం అలరిస్తూ సాగింది. ‘చిన్న పిల్లకు సమృద్ధి, ఆయురారోగ్యాలు కలగుతాయని, అందుకే భోగి పళ్ళు పోస్తారని" పద్మ కిల్లి అన్నారు. అనంతరం యుక్త అధ్యక్షులు ప్రసాద్ మంత్రాల మాట్లాడుతూ.. తెలుగు పండుగ రోజు తెలుగు వారందరూ తెలుగు నేల కాని చోట కలుసుకోవడమే ఒక పెద్ద పండుగ అని, సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా బాలలు పాల్గొన్నవి చూస్తుంటే బ్రిటన్ లో తెలుగు ను మరువకుండా పిల్లలకు తెలుగు వారసత్వాన్ని ఇస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యెక వందనాలను తెలియజేశారు. మన భాష సంప్రదాయాలనే కాక మన వంటలు, పిండి వంటలను కూడా ఈ నేలపై ఉన్న వారికి రుచి చూపిస్తూ తెలుగు రుచులను జగత్‌ వ్యాపితం చేద్దాము అని పిలుపునిచ్చారు.  ఐదు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మందికి పైగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి  తోడ్పాటు నిచ్చిన వారందరికీ  యుక్తా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో యుక్త కార్యవర్గ సభ్యులు సత్యప్రసాద్ మద్దసాని, నరేంద్ర మున్నలూరి, రుద్రవర్మ బట్ట, రాజ్ ఖుర్భా, అమర్ చింతపల్లి, కార్తీక్ గంట, కృష్ణ యలమంచిలి, ఆదిత్య అల్లాడి తదితరులు  పాల్గొన్నారు .
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top