టీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీసీఎస్‌ఎస్‌ | TCSS Wishes TRSTelangana Elections Results | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీసీఎస్‌ఎస్‌

Dec 12 2018 2:41 PM | Updated on Dec 12 2018 2:45 PM

TCSS Wishes TRSTelangana Elections Results - Sakshi

సింగపూర్‌ :  తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం తెలంగాణ ప్రజల గుండె చప్పుడని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌ చేసిన ఎన్నో ప్రజా ఉపయోగ, సంక్షేమ కార్యక్రమాల ఫలితమే ఈ ఘనవిజయం అని తెలిపారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకృషిని కొనియాడారు. 

దీంతో పాటు అత్యధిక మెజారిటీ సాధించిన హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, కరుణాకర్ రావు మొదలగు వారు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement