లాస్‌ఏంజిల్స్‌లో ఘనంగా 'టాస్క్‌' స్టార్‌ నైట్‌ | TASC conducts Star night in America | Sakshi
Sakshi News home page

లాస్‌ఏంజిల్స్‌లో ఘనంగా 'టాస్క్‌' స్టార్‌ నైట్‌

Aug 2 2018 8:57 AM | Updated on Aug 2 2018 9:31 AM

TASC conducts Star night in America - Sakshi

లాస్‌ఏంజిల్స్‌ :  దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం(టాస్క్‌) ఆధ్వర్యంలో లాస్‌ఏంజిల్స్‌లో స్టార్ నైట్ నిర్వహించారు. 2200 మందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక పక్క ఇండియన్ ఐడిల్ - రేవంత్, ఫిలిం ఫేర్ అవార్డు గ్రహీత మధు ప్రియ, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి సోదరి ఆదర్శిని సినిమా పాటలతో అదరగొడితే మరొక పక్క తెలంగాణా జానపద గీతాలతో భిక్షు నాయక్, సాయి చంద్ హూషారెత్తించారు. ఆలీ, సుడిగాలి సుధీర్ కామెడీ రియాలిటీ గేమ్‌తో నవ్విస్తే, యాంకర్లుగా అల్లరి ధనరాజ్, చిత్రలేఖ అలరించారు. గ్లామర్ తారలు మన్నారా చోప్రా (ప్రియాంక చోప్రా సోదరి), అంగనా రాయ్ తమ నృత్యాలతో మెప్పించారు. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘంలోని ఔత్సాహిక సభ్యులు చేసిన డ్యాన్సులు అతిథులను ఆకట్టుకున్నాయి. అలాగే ఆరు బయట చక్కని సాయంత్ర సమయంలో మహిళల కోలాటం, జానపద పాటలకు నృత్యాలు రంజింపజేశాయి. గోదావరి రెస్టారెంటు వారు అందించిన రుచికరమైన భోజనాన్ని ఒక పక్క ఆస్వాదిస్తూ మరోపక్క ఆరు బయట జరిగిన నృత్య విన్యాసాలను ప్రేక్షకులు వీక్షించారు.
 
ఈ కార్యక్రమాన్ని తెలుగు సంఘం సభ్యులకు అందించడం కోసం వందకు పైగా వాలంటీర్లు ఎన్నో రోజులుగా శ్రమించారు. ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి  సాముల, కార్య నిర్వాహక సభ్యులు ప్రవీణ్‌ ఆళ్ల, బుచ్చిరెడ్డి, సూర్య రెడ్డి, రామ్ కొడితల, సువర్ష కామర్సు, రామకృష్ణ శీలంలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement