టాంటెక్స్ 2019 నూతన కార్యవర్గం

TANTEX Elected New Committee Members - Sakshi

డల్లాస్‌ : తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌ ) 2019 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 6న డల్లాస్‌లో జరిగిన గవర్నింగ్‌ బోర్డు సమావేశంలో ప్రకటించారు. టాంటెక్స్‌ అధ్యక్షుడుగా వీర్నపు చినసత్యం బాధ్యతలు స్వీకరించారు.

ఉపాధ్యాక్షులుగా కోడూరు కృష్ణా రెడ్డి, పాలేటి లక్ష్మీలలను నియమించగా, కార్యదర్శిగా పార్నపల్లి ఉమా మహేష్‌, సంయుక్త కార్యదర్శిగా తోపుదుర్తి ప్రభంద్‌ రెడ్డి, కోశాధికారిగా ఎర్రం శరత్‌, సంయుక్త కోశాధికారిగా బొమ్మ వెంకటేష్‌, తక్షణ పూర్వాధ్యక్షులుగా శీలం కృష్ణ వేణిలను ఎన్నుకున్నారు. అదే విధంగా పాలక మండలి బృంధాన్ని కూడా ఈ సమావేశంలో ప్రటించారు. పాలకమండలి అధిపతిగా ఎన్‌. ఎం. యస్‌.రెడ్డి, ఉపాధిపతిగా నెల్లుట్ల పవన్‌ రాజ్‌లను ఎన్నుకున్నారు. సభ్యులుగా కన్నెగంటి చంద్రశేఖర్‌, కొనార రామ్‌, మందాడి ఇందు రెడ్డి, ఎర్రబోలు దేవేందర్‌, డా. పామడుర్తి పవన్‌లను సంస్థ ఎన్నుకుంది.

ఈ సందర్భంగా టాంటెక్స్‌ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. టాంటెక్స్‌ లాంటి గొప్ప సంస్థకి 33వ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కాజ చంద్రశేఖర్‌, మండిగ శ్రీలక్ష్మీ, మనోహర్‌ కసగాని, జొన్నల శ్రీకాంత్‌ రెడ్డి, కొండా మల్లిక్‌, మెట్టా ప్రభాకర్‌, తాడిమేటి కల్యాణి, లంక భాను, ఇల్లెందుల సమీర, బండారు సతీష్‌, చంద్రా రెడ్డి పోలీస్‌, యెనికపాటి జనార్దన్, కొనిదాల లోకేష్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top