ఆస్ట్రేలియా, అమెరికాల్లో ‘వాక్‌ విత్‌ జగనన్న’ | NRIs for 'Walk with Jagan Anna' | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా, అమెరికాల్లో ‘వాక్‌ విత్‌ జగనన్న’

Jan 28 2018 3:02 PM | Updated on Apr 4 2019 3:25 PM

NRIs for 'Walk with Jagan Anna'  - Sakshi

ఆస్ట్రేలియా, అమెరికాల్లో.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ప్రవాస భారతీయలు శనివారం జగన్‌కు సంఘీభావ యాత్ర నిర్వహించారు. చింతల చెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, పార్టీ యువనేత శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి అభినందించారు. అమెరికాలోని పలు నగరాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు వాక్‌విత్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించి స్థానికులను సైతం ఆకట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement