పురోహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ చేయూత | Leon Human Foundation Helping Telangana Purohit | Sakshi
Sakshi News home page

పురోహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ చేయూత

May 27 2020 4:01 PM | Updated on May 27 2020 4:16 PM

Leon Human Foundation Helping Telangana Purohit - Sakshi

కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న పురోహితులకు యూఎస్‌ఏకు చెందిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్‌ చేయుత అందిస్తోంది. ఫౌండేషన్‌ ప్రతినిధులు స్పందిస్తూ.. ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులు ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పురోహితులకు పూట గడవడమే కష్టంగా ఉందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభకార్యాల మీదే ఆధారపడి జీవిస్తున్న బ్రాహ్మణుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని.. వీరికి ఎటువంటి నెలసరి జీతం లేకపోవడంతో నిత్యావసరాలు, ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. 

పురోహితుల బాధను చూసి చలించిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ యాజమాన్యం పుల్లా రెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి సుమన్ టీవీ వారితో కలిసి ఇబ్బంది పడుత్నున్న 110 మంది పురోహితులకు నెలకు సరిపడే నిత్యావసరాలు అందజేశామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ వారికీ  సుమన్ టీవీ కృతజ్ఞతలు తెలియజేసింది.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement