
డాలస్ : తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. ఈ నెల 7వ తేదీన డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో టాంటెక్స్ నూతన కార్యవర్గ వివరాలను ప్రకటించింది.
టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా శీలం కృష్ణవేణి పదవీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టాంటెక్స్ లాంటి ఉన్నత సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కొత్తపాలకమండలి, కార్యవర్గ సభ్యుల సూచనలతో 2018లో వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కార్యనిర్వహక బృందం
అధ్యక్షులు : శీలం కృష్ణవేణి
ఉత్తరాధ్యక్షుడు : వీర్నపు చిన్నసత్యం
ఉపాధ్యక్షుడు : కోడూరు కృష్ణారెడ్డి
కార్యదర్శి : మండిగ శ్రీలక్ష్మీ
సంయుక్త కార్యదర్శి : కసగాని మనోహర్
కోశాధికారి : పాలేటి లక్ష్మీ
సంయుక్త కోశాధికారి : కొణిదల లోకేష్ నాయుడు
తక్షణ పూర్వాధ్యక్షులు : ఉప్పలపాటి కృష్ణారెడ్డి
కాజా చంద్రశేఖర్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమా మహేష్, బ్రహ్మదేవర శేఖర్ రాజు, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, లంక భాను, ఎర్రం శరత్, ఇల్లెందుల సమీర, బండారు సతీష్, చంద్రారెడ్డి పోలీస్, బొమ్మ వెంకటేష్, యెనికపాటి జనార్ధన్
పాలకమండలి బృందం
అధిపతి : డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి
ఉపాధిపతి : కొనార రామ్
కన్నెగంటి చంద్రశేఖర్, ఎన్‌ఎంఎస్ రెడ్డి, మందాడి ఇందు రెడ్డి, నెల్లూట్ల పవన్ రాజ్, ఎర్రబోలు దేవేందర్