ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి.. | Indian Student Died in America With heart Stroke | Sakshi
Sakshi News home page

కుత్బుల్లాపూర్‌లో విషాదఛాయలు

May 20 2019 8:59 AM | Updated on Jul 6 2019 12:42 PM

Indian Student Died in America With heart Stroke - Sakshi

అమీర్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్లు అమెరికాలో మృతి చెందిన మహమ్మద్‌ అమీర్‌ (ఫైల్‌)

చింతల్‌: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి గుండెపోటుతో మృతి చెందడంతో కుత్బుల్లాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ రంగారెడ్డినగర్‌ డివిజన్‌ గుబురుగుట్టకు చెందిన మహ్మద్‌ జహంగీర్‌ కుమారుడు మహమ్మద్‌ అమీర్‌(27) నాలుగున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువుకుంటూనే  పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న గుండెపోటుతో మరణించాడు. దీంతో గుబురుగుట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా అమీర్‌ తల్లి ఏడాది క్రితమే మరణించినా స్వదేశానికి తిరిగి రాలేదని ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.

ఎమ్మెల్యే పరామర్శ..
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కార్పొరేటర్లు విజయ్‌శేఖర్‌గౌడ్, రావుల శేషగిరిలు ఆదివారం అమీర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతదేహన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాయలు చేశామని, ఎంబసీ అధికారులతో  కేటీఆర్‌ మాట్లాడినట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement