76 ఏళ్లుగా తిండీ, నీళ్లు ముట్ట‌ని యోగి క‌న్నుమూత‌ | Yogi Prahlad Jani Survive Without Food, Water For 70 Years Passed Away | Sakshi
Sakshi News home page

అన్న‌పానీయాలెరుగని బాబా క‌న్నుమూత‌

May 26 2020 4:13 PM | Updated on May 27 2020 9:52 PM

Yogi Prahlad Jani Survive Without Food, Water For 70 Years Passed Away - Sakshi

గాంధీన‌గ‌ర్‌: 76 ఏళ్లుగా అన్న‌పానీయాలు ముట్టుకోని యోగి ప్ర‌హ్లాద్ జాని(90) మంగ‌ళ‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. భ‌క్తుల సంర్శ‌నార్థం ఆయ‌న మృతత‌దేహాన్ని రెండు రోజుల పాటు బ‌న‌స్కంత‌లోని ఆశ్ర‌మంలో ఉంచ‌నున్నారు. అనంత‌రం గురువారం నాడు అదే ఆశ్ర‌మంలో అంత్య‌క్రియ‌లు చేప‌ట్ట‌నున్నారు. కాగా ప్ర‌హ్లాద్ జాని గుజ‌రాత్‌లోని చ‌రడా గ్రామంలో జ‌న్మించారు. ఈ యోగిని అత‌ని భక్తులు ప్రేమ‌గా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజ‌రాత్‌లో ఇత‌ని పేరు తెలియ‌ని వారు ఉండ‌ర‌న‌డంలో అతిశ‌యోక్తి  లేదు. తిండీ, నీళ్లు లేకుండా 76 ఏళ్లుగా జీవించ‌డంతో అత‌నిపై ఎంతోమంది శాస్త్రవేత్త‌లు అధ్య‌య‌నం చేశారు. అందులో మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లామ్ కూడా ఒక‌రు. ఏమీ తిన‌కుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య)

ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అస‌లు కారణాన్ని మాత్రం రాబ‌ట్ట‌లేక‌పోయారు. 2010లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గ‌దిలో ఉంచి వీడియో మానిట‌రింగ్ నిర్వ‌హించారు. అనంత‌రం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, త‌దిత‌ర వైద్య ప‌రీక్ష‌లు జరిపారు. ఈ ఫ‌లితాల్లో ఆయ‌న‌కు అసాధార‌ణ రీతిలో ఆక‌లి, దాహాన్ని త‌ట్టుకునే ల‌క్ష‌ణాలున్నాయ‌ని వెల్ల‌డైంది. అయితే ధ్యాన‌మే త‌న‌ను బ‌తికిస్తోంద‌ని యోగి గ‌తంలోనే స‌మాధాన‌మిచ్చారు. కాగా ఆయ‌న ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన వారిలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. (శివాల‌యంలో సాధువుల దారుణ హ‌త్య‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement