breaking news
Prahlad
-
ఆహార్యమే ఆధారమై!
నేరస్థలంలో దొరికే ఆధారాలు నిందితులను పట్టించడానికే కాదు, ఒక్కోసారి అమాయకులను రక్షించడానికీ ఉపయోగపడతాయి. నగరంలో నమోదైన హైప్రొఫైల్ కేసులో ఒకటి రికార్డుల్లో నిలిచిపోయే జగదాంబ జ్యూలర్స్ యజమాని ప్రహ్లాద్ అగర్వాల్ భార్య పుష్పాబాయి హత్యకేసు దర్యాప్తులో తొలుత అనుమానితుల జాబితా భారీగా ఉంది. అనేకమందిని విచారించారు. ఎట్టకేలకు సంఘటనా స్థలంలో నిందితుడు వదిలి వెళ్లిన దుస్తులు, జేబులో లభించిన వస్తువుల ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.బషీర్‌బాగ్‌లో జగదాంబ జ్యూలర్స్ నిర్వహించే ప్రహ్లాద్ అగర్వాల్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో నివసించేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. అగర్వాల్ భార్య పుష్పాబాయితో పాటు ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమలు ఒకే ఇంట్లో ఉండేవారు. అగర్వాల్, ఆయన కుమారులు 2005 అక్టోబర్ 5 ఎప్పటిలాగే వారి బంగారం దుకాణానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడలు రాధిక నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వారందరూ హడావుడిగా ఇంటికి పరిగెత్తేలా చేసింది. అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు డాక్టర్లును పిలిపించారు. వాళ్లు వచ్చి రక్తపు మడుగులో ఉన్న పుష్పాబాయిని నిశితంగా పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. దీన్ని హత్యగా తేల్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో లభించిన ఓ చొక్కా గుండీ, ప్యాంటు–షర్టు, ఆడవారి చెప్పులు, కుర్తా–పైజామాలతో పాటు హతురాలు పుష్పాబాయి చేతిలో ఉన్న పొడువాటి వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ పాదముద్రనూ గుర్తించి, దాన్ని కెమెరాలో బంధించారు. ఇంటి చుట్టూ క్షుణ్ణంగా పరిశీలించగా, హత్య జరిగిన గది నుంచి వంటింటి మీదుగా బయట వరకు పడిన రక్తపు మరకలు కనిపించాయి. వీటి నమూనాలు సేకరించి, సాంకేతికంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు– అవి హతురాలివి కావని, హంతకుడికి అయిన గాయం నుంచి కారినవని నిర్ధారించారు. తన భార్య ప్రతిరోజూ ధరించే రెండు బంగారు గాజులు కనిపించట్లేదంటూ ప్రహ్లాద్ పోలీసులకు తెలిపారు. ఎక్కువ సొత్తు చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దోపిడీ దొంగల పని కాదని భావించారు. కేవలం పరిచయస్తుల పనిగా అనుమానించి, ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు తొలుత ఒక అనుమానితుల జాబితా రూపొందించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరి పూర్వాపరాలు తెలుసుకుని ఒక్కోక్కరికీ క్లీన్చిట్ ఇస్తూ పోయారు. ఇదిలా ఉండగా, హతురాలి చేతిలో లభించిన వెంట్రుకలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు కొందరి అనుమానితుల నుంచి సేకరించిన వాటితో పోల్చారు. అవి ఎవరి వాటితోనూ సరిపోలలేదు. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పుష్పాబాయి నమూనాలతోనూ పరీక్షించి ఆమెవే అని తేల్చారు. హత్య జరిగిన గది బయట స్వాధీనం చేసుకున్న చెప్పులు పుష్పాబాయి కోడలివిగా తేలాయి. ఘటనా స్థలిలో పడి ఉన్న కుర్తా–పైజామా ఆ ఇంట్లో వారివే అని స్పష్టం కావడంతో దానిపై ఉన్న రక్తపు మరకల కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం నిందితులు తమకు అంటిన రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఆ దుస్తులు వినియోగించారని వెల్లడైంది. అంతకంతకూ కేసు జటిలంగా మారుతుండటంతో అధికారులు మరింత లోతుగా, సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఆ ఇంట్లో పని చేస్తున్న ఒడిశా యువకుడిని, అతడి కుటుంబీకులు, సన్నిహితులను అనుమానితుల జాబితాలో చేర్చారు. హత్యాస్థలిలో లభించిన నమూనాలు వీరిలో ఎవరి వాటితోనూ సరిపోలేదు. దీంతో దర్యాప్తు అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇస్తూ వదిలేశారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలుల్లో ఉన్న చొక్కా బటన్, ప్యాంటు–షర్టులపై పోలీసులు దృష్టి పడింది. రక్తపు మరకలు అంటిన ఆ ప్యాంట్, షర్ట్ విప్పే క్రమంలోనే దాని గుండీ తెగిపడి ఉంటుందని తేల్చారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ జత బట్టలు కనిపించట్లేదంటూ యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హత్య చేస్తున్నప్పుడు ధరించిన దుస్తులను అక్కడ వదిలేసిన నిందితుడు– యజమాని దుస్తులను వేసుకు వెళ్లాడని వెల్లడైంది. నిందితుడు వదిలేసిన ప్యాంట్ కాళ్ల దగ్గర మడిచి ఉండటం, జేబులో కాల్చిన చింత గింజలు వంటివి లభించడంతో హత్య చేసిన వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పోలీసులు అంచనా వేశారు. ఆ ఆహార్యంతో ఉండే వ్యక్తులు ఎవరంటూ హతురాలి సంబంధీకులను పోలీసులు ప్రశ్నించగా, వెలుగులోకి వచ్చిన పేరే నర్సింహ. హతురాలి కుమార్తె వద్ద గతంలో పనిమనిషిగా ఉండి మానేసినట్లు వెల్లడైంది. మరోపక్క హత్యకు ముందు ఆ ఇంటికి రాకపోకలు సాగించిన వారి వివరాలు ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నర్సింహతో పాటు నారాయణ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తేల్చారు. హత్య తర్వాత అతడు ఆ చుట్టుపక్కలకు రాకపోవడంతో అనుమానం నిజమైంది. దీంతో అతడి ఇంటి అడ్రస్ తీసుకున్న పోలీసులు గగన్‌మహల్ వద్ద ఉన్న గదిపై దాడి చేశారు. అప్పటికే అది తాళం వేసి ఉండటం, స్వస్థలమైన మెదక్ జిల్లా చిన శంకరంపేటలోనూ అతడి ఆచూకీ లేకపోవడంతో ఈ హత్య నర్సింహ పనిగా నిర్ధారించారు. నర్సింహ కోసం తాము వెతుకుతుంటే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీలుసు భావించారు. గగన్‌మహల్‌లో అతడు అద్దెకు తీసుకున్న గదిలో సామాను అలానే ఉందా? లేదా? అనేది గమనించారు. అవన్నీ అక్కడే ఉండటంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ముందు అతడి కోసం పోలీసులు గాలించట్లేదని అనుకునేలా చేద్దామని దర్యాప్తు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు గగన్‌మహల్‌లో ఉన్న గదిపై నిఘా ఉంచిన మఫ్టీ పోలీసులు ఎట్టకేలకు నర్సింహ రాకను గుర్తించి పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా, నారాయణ అనే వ్యక్తిని పనిలో చేర్చే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ అగర్వాల్ ఇంటికి అతడితో కలిసి వెళ్లానని, అయితే పుష్పాబాయి వద్ద ఉన్న సొత్తు చూసి దాని కోసం నారాయణతో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత భయం వేయడంతో కేవలం గాజులు మాత్రమే పట్టుకుని పారిపోయామని బయటపెట్టాడు. దీంతో గాలింపు కొనసాగించిన అధికారులు నారాయణను కూడా అరెస్టు చేయగలిగారు. శ్రీరంగం కామేష్ -
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..!
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..! -
ఎంపీ పదవికి 10 మంది రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి బుధవారం రాజీనామా సమరి్పంచారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఇకపై ఎమ్మెల్యేలుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 12 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వం వదులుకుంటున్నారు. వీరికి సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. బుధవారం 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేశ్ సింగ్, ఉదయప్రతాప్ సింగ్, రితీ పాఠక్, రాజస్తాన్‌కు చెందిన కిరోడీలాల్ మీనా, దియా కుమారి, రాజవర్దన్ సింగ్ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోమతిసాయి, అరుణ్ సావో రాజీనామా సమరి్పంచారు. వీరిలో కిరోడీలాల్ మీనా ఒక్కరే రాజ్యసభ సభ్యుడు. మిగిలినవారంతా లోక్‌సభ సభ్యులు. మరో కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌తోపాటు ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి అతి త్వరలో రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకోనున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రులను బీజేపీ అధిష్టానం ఇంకా నియమించలేదు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వచ్చిన వారిలో కొందరికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించబోతున్నానని తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో మూడు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే ఈ మూడు పదవులను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరేలా ఈ భర్తీ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. -
బీజేపీలోకి అజ్మీరా చందూలాల్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, దివంగత అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు గరికపాటి మోహన్‌రావుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈటల రాజేందర్, ప్రహ్లాద్‌కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీజేపీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కేంద్ర కేబినెట్లోని 75 మంది మంత్రుల్లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది గిరిజనులు ఉన్నారని, బీజేపీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అలాగే ఆదివాసీ మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనేనన్నారు. పార్టీ మారితే పెన్షన్ తీసేస్తామని బెదిరించడం సరికాదని, పెన్షన్ డబ్బులు ప్రజలవే తప్ప సీఎం కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చిందని, కేసీఆర్ డబ్బు సంచులు, మందు సీసాలకు ప్రజలు లొంగకుండా తనను గెలిపించారని అన్నారు. -
76 ఏళ్లుగా తిండీ, నీళ్లు ముట్టని యోగి కన్నుమూత
గాంధీనగర్: 76 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి ప్రహ్లాద్ జాని(90) మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భక్తుల సంర్శనార్థం ఆయన మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో ఉంచనున్నారు. అనంతరం గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. కాగా ప్రహ్లాద్ జాని గుజరాత్‌లోని చరడా గ్రామంలో జన్మించారు. ఈ యోగిని అతని భక్తులు ప్రేమగా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజరాత్లో ఇతని పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తిండీ, నీళ్లు లేకుండా 76 ఏళ్లుగా జీవించడంతో అతనిపై ఎంతోమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య) ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ ఫలితాల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలున్నాయని వెల్లడైంది. అయితే ధ్యానమే తనను బతికిస్తోందని యోగి గతంలోనే సమాధానమిచ్చారు. కాగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం గమనార్హం. (శివాలయంలో సాధువుల దారుణ హత్య) -
దేవాస్ బరిలో ప్రసిద్ధ గాయకుడు ప్రహ్లాద్
నీటికీ, కన్నీటికీ రంగు ఉంటుందా? చెట్టుకీ అది పంచే గాలికీ కులముం టుందా? ఇవన్నీ ప్రతి ఒక్కరికీ బతుకునిచ్చేందుకు కాక మరెందుకు అంటారు కబీర్ కవితలనూ, గీతాలనూ, భజనలరూపంలో దేశవిదేశాల్లో ప్రదర్శిస్తూ సంగీతానికి సరిహద్దుల్లేవని చాటిచెప్పిన ప్రహ్లద్. మధ్యప్రదేశ్ దేవాస్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రహ్లాద్ సింగ్ తిపానియా మధ్యప్రదేశ్ ప్రజలకు సుపరిచితుడు. కబీర్ కవిత్వాన్ని విభిన్న గొంతుకలతో వినిపిస్తోన్న జానపదగాయకుడు ప్రహ్లాద్ సంగీతంతో ప్రజలమదిని మెప్పించినా తాజాగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కబీర్ గానంతో సంగీత సామ్రాజ్యంలో తనదైన స్థానాన్ని నిలుపుకున్న ప్రహ్లాద్‌ని కాంగ్రెస్ పార్టీ దేవాస్‌ని నిలబెట్టడంతో సంగీతాభిలాషుల దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. దేవాస్‌లో గత (2014) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోహర్ ఉంత్వాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సజ్జన్ సింగ్ వర్మపై 2,60,313 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఈ సీటుని కైవసం చేసుకుంది. అయితే ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని నిలబెట్టుకుకోవాలని బీజేపీ యత్నిస్తోన్న తరుణంలో కబీర్ గానాన్ని దశదిశలా వ్యాపింపజేస్తోన్న సం గీతకారుడు ప్రహ్లాద్‌సింగ్ సంగీతాన్ని విజ యపాచికగా వేసింది. దీంతో ఇక్కడి ప్రజలు కళాకారుడికి పట్టంకడతారా లేక తిరిగి బీజేపీకే పవర్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మాల్వ ప్రాంతంలో 1954 సెప్టెంబర్ 7న బలాయీ దళిత కుటుంబంలో జన్మించిన ప్రహ్లాద్ మాల్వి జానపద శైలి రేడియో శ్రోతలకు సుపరిచితం. ఇండోర్, భోపాల్, జబల్పూర్, పట్నా, లక్నోవాంద్, కాన్పూర్ ఆకాశవాణి స్టేషన్లలో ప్రహ్లాద్ కబీర్ గానాలాపనకు చెవికోసుకోని వారుండరు. సాంప్రదాయక వాయిద్యాలైన తంబూర, ఖార్తాల్, మంజీర, ఢోలక్, హార్మోనియం, తిమ్కీ, వయోలిన్లతో ప్రహ్లాద్ భిన్నమైన జానపద కంఠంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. అమెరికా కబీర్ యాత్ర పేరుతో సంగీత యాత్రను నిర్వహించిన ప్రహ్లాద్ తిపానియా అమెరికా, కెనడా, పాకిస్తాన్, లండన్ తదితర దేశాల్లో ప్రహ్లాద్ విస్తృతంగా కబీర్ కవితాగానం చేశారు. తొలుత సాధారణ స్కూల్ టీచర్‌గా ఉన్న ప్రహ్లాద్ క్రమేణా కబీర్ ప్రపంచంలో తలమునకలయ్యారు. జానపద సాహిత్యంలో భాగమైన కబీర్ కవితాగానాన్ని ఒడిసిపట్టుకున్న ప్రహ్లాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేయడం ఇటు సంగీత ప్రపంచంలోనూ, అటు సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 2011లో పద్మశ్రీ అవార్డుతో సహా ప్రముఖ అవార్డులెన్నింటినో సొంతం చేసుకున్న కబీర్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని లూన్యఖేది అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆత్మారామ్‌జీ, సంపత్‌బాయిల సంతానమైన ప్రహ్లాద్ తన సంగీతానికి సంబంధించి బీజేపీ నుంచి విమర్శలెదుర్కొంటున్నారు. అయితే గాలికీ, నీటికీ లేని కులం, మతం సంగీతానికెందుకని సున్నితంగా సమాధానమిస్తున్నారు ప్రహ్లాద్. -
స్మృతికి మోదీ సోదరుడి షాక్
ఘజియాబాద్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊహించని పరిణామం ఎదురైంది. స్మృతి డిగ్రీ పట్టాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. స్మృతి నకిలీ సర్టిఫికెట్లు పొందారన్న ఆరోపణలపై విచారణ చేయాలని అభిప్రాయపడ్డారు. అఖిల భారత రేషన్ డీలర్ల ఉపాధ్యక్షుడయిన ప్రహ్లాద్ ఘజియాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మాజీ న్యాయ శాఖ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే జితేందర్ సింగ్ తోమర్ కేసులాగే స్మృతి విషయంలో వ్యవహరించాలని ప్రహ్లాద్ మోదీ కోరారు. స్మృతి నకిలీ డిగ్రీలు పొందారని ఆరోపిస్తూ, వీటిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ప్రధాని సోదరుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం స్మృతికి ఇబ్బందికర పరిస్థితి. నల్లధనం అంశం గురించి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీసేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి వీసా మంజూరు విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో సాయం చేశారని ప్రహ్లాద్ మోదీ అన్నారు. -
'ఇన్స్టాంట్ క్రికెట్‌తోనే ఇక్కట్లు పెరిగాయి'


