అయోధ్యలో నేడు శ్రీరాముడి విగ్రహావిష్కరణ

Yogi Adityanath Will Visit Ayodhya Today To Unveil Statue Of Lord Ram - Sakshi

లక్నో : అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్‌ సంస్ధాన్‌ మ్యూజియంలో రోజ్‌వుడ్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు. రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని అవతారంలో ఈ విగ్రహం రూపొందింది.

మ్యూజియంలో రాముడి గురించిన పలు చారిత్రక ఘట్టాలతో 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. కోదం‍డరామ విగ్రహాన్ని కర్ణాటక స్టేట్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎంపోరియం నుంచి కొనుగోలు చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అయోధ్యలో శుక్రవారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top