దీని వేగం.. ఎలక్ట్రిక్.. | World's fastest electric car | Sakshi
Sakshi News home page

దీని వేగం.. ఎలక్ట్రిక్..

Jul 6 2014 12:32 AM | Updated on Sep 5 2018 2:17 PM

దీని వేగం.. ఎలక్ట్రిక్.. - Sakshi

దీని వేగం.. ఎలక్ట్రిక్..

నీలం రంగులో ముద్దొస్తున్న ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు.. పేరు డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పీ:01.. వేగం విషయానికొస్తే.. 3.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

నీలం రంగులో ముద్దొస్తున్న ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు.. పేరు డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పీ:01.. వేగం విషయానికొస్తే.. 3.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అదీ ఒక్కసారి చార్జ్ చేస్తే.. 305 కిలోమీటర్ల వరకూ మనం మళ్లీ తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. 4.3 గంటలపాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. డెట్రాయిట్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవలే దీన్ని ఆవిష్కరించింది. ధర రూ.92 లక్షల నుంచి రూ.1.3 కోట్ల మధ్య ఉండవచ్చు. త్వరలో దీన్ని మార్కెట్లోకి తెస్తామని సదరు కంపెనీ ప్రకటించింది. ఎస్‌పీ:01లను 999 మాత్రమే తయారుచేస్తామని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement