రైళ్లకు పసుపు రంగు వేయండి: ప్రపంచ బ్యాంకు | World Bank safety tips to India: Paint trains yellow, have powerful lights | Sakshi
Sakshi News home page

రైళ్లకు పసుపు రంగు వేయండి: ప్రపంచ బ్యాంకు

Sep 2 2017 2:06 AM | Updated on Sep 17 2017 6:15 PM

రైళ్లకు పసుపు రంగు వేయండి: ప్రపంచ బ్యాంకు

రైళ్లకు పసుపు రంగు వేయండి: ప్రపంచ బ్యాంకు

దేశంలో రైల్వే ప్రమాదాలను నివారించేందుకు రైళ్లన్నింటికీ ప్రకాశవంతమైన పసుపు రంగును వేయాలని ప్రపంచ బ్యాంకు రైల్వే శాఖకు సూచించింది.

న్యూఢిల్లీ : దేశంలో రైల్వే ప్రమాదాలను నివారించేందుకు రైళ్లన్నింటికీ ప్రకాశవంతమైన పసుపు రంగును వేయాలని ప్రపంచ బ్యాంకు రైల్వే శాఖకు సూచించింది. రైల్వే ఉద్యోగులందరూ ప్రకాశవంతంగా ఉండే దుస్తుల్ని ఎల్లప్పుడూ ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  ఈ మేరకు ‘భారత రైల్వేల్లో భద్రతను పటిష్టం చేయడం’ అన్న అంశంపై ప్రపంచ బ్యాంకు నివేదికను సమర్పించింది. దేశంలో రైలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాల్సిందిగా రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాంకు సహా పలు అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఈ నివేదికలోని ఇతర కీలకాంశాలు

ప్రతి రైలులో అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలను ఏర్పాటు చేయాలి.
ప్రమాదాల సమయంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించుకోవాలి.
ప్రతి రైలు ముందు శక్తిమంతమైన డిచ్‌ లైట్లను ఏర్పాటు చేయాలి.
ఉద్యోగులు ధరిస్తున్న హెల్మెట్లు, బూట్లు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అనుకూలమో? కాదో? పరిశీలించాలి.

Advertisement
 
Advertisement
Advertisement