చంద్రయాన్‌ 3 విజయవంతానికి కృషి: శివన్‌

Work Begun On Chandrayaan-3 Mission Says By ISRO Chief Sivan - Sakshi

చంద్రయాన్‌-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ తెలిపారు. శివన్‌ మీడియాతో మాట్లాడుతూ..చంద్రయాన్‌-2 ప్రయోగానికి రూ. 250కోట్లు ఖర్చు కావచ్చని తెలిపారు. చంద్రయాన్-3 కూడా విజయవంతం అవుతుందని తెలిపారు. చంద్రయాన్-3లో ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ రోవర్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగంతో  సైన్స్‌ డేటాను ఉత్పత్తి చేయడానికి 7 సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపారు. చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–2 చివరి నిమిషంలో విఫలం అవడం పట్ల కే. శివన్, ఇతర శాస్త్రవేత్తలు నిరాశ చెందడం, ప్రధాని నరేంద్ర మోదీ వారిని ఓదార్చిన విషయం తెలిసిందే.  

2019లో ఇస్రో విజయాలను శివన్ ప్రస్తావిస్తూ.. కొత్త సంవత్సరంలో ఇస్రో ప్రణాళికలను మీడియాకు తెలియజేశారు. 2020లో చంద్రయాన్-3, గగన్‌యాన్ ప్రయోగాల విజయవంవతం అవ్వడానికి కృషి చేస్తామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం దిశగా 2019లో మంచి పురోగతి సాధించాం. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ తొలిసారిగా చేపడుతున్న ప్రయోగం కోసం.. నలుగురు వ్యోమగాములను గుర్తించామని, వీరికి త్వరలోనే శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివన్ తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ..2020లో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ప్రారంభస్తారని.. చంద్రయాన్‌-2 కంటే చంద్రయాన్‌-3 చాలా తక్కువ ఖర్చవుతుందని అభిప్రాయపడ్డారు.  

చివరి నిమిషంలో చంద్రయాన్‌-2 విఫలమవ్వడం పట్ల శివన్‌ స్పందిస్తూ..రెండు దశలు కొనసాగిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో మొదటి దశలో చంద్రయాన్‌ 3,84,400 కిలోమీటర్లు అంతరిక్షంలో విజయవంవతంగా ప్రయాణించిందని అన్నారు. రెండో దశ చాలా క్లిష్టమైందని, అందులోనే కొంచెం విఫలమయ్యామని అన్నారు ప్రపంచంలో చంద్రయాన్‌-2 ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై ప్రవేశించిన మొదటి దేశం భారత్‌ అని పేర్కొన్నారు. అగ్ర దేశాలైన అమెరికా, చైనా కూడా ఇంత వరకు ప్రయత్నించలేదని శివన్‌ గుర్తు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top