
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: 2040 నాటికి చంద్రుడిపైకి తొలి వ్యోమగామిని పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇది దేశ అంతరిక్ష యాత్రకు అత్యత కీలకమైన అంశం కానుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ యాత్ర సక్సెస్ అంశంలో భాగంగా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి -- 2047 నాటికి వికసిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం యొక్క కీలక పాత్ర' అనే అంశంపై లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ మాట్లాడిన ఆయన.. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతరిక్షం రంగానికి సంబంధించి సంస్కరణలు చేపట్టారన్నారు.
2020లో అంతరిక్క్ష రంగం అభివృద్ధికి ఇప్పటికే ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుందని, వచ్చే దశాబ్దంలో 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, చంద్రుడిపైకి వ్యోమగామిని పంపించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్-3
అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2023, జూలై 14వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రయాన్–3.. 25 కిలోల రోవర్‌ను తీసుకెళ్లగా, చంద్రయాన్–5 మిషన్ 250 కిలోల బరువున్న రోవర్‌ను తీసుకెళ్లనుంది. 2027 నాటికి చంద్రయాన్–4ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.