అవినీతికి తన కొడుకు పాల్పడ్డా ఉపేక్షించేదిలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కన్నకొడుకైనా ఉపేక్షించను: కేజ్రీవాల్
May 23 2016 12:21 PM | Updated on Oct 16 2018 8:03 PM
పనాజి: అవినీతికి తన కొడుకు పాల్పడ్డా ఉపేక్షించేదిలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పనాజిలోని పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీ ఫుడ్ మినిష్టర్ లంచం ఇవ్వమని డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆయనను పదవినుంచి తొలగించిన విషయం తెలిసిందే. గోవాలో జరగనున్న 2017 అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని కేజ్రీవాల్ గోవాలో ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్టాడుతూ.. మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు రుణంగా రూ.9 వేల కోట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, తమ ప్రభుత్వం 36 లక్షల పేద కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ కింద రూ. 400 కోట్లు మాఫీ చేస్తే దానిని కాంగ్రెస్ విమర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్యా విదేశాలకు పారిపోవడానికి సహకరించిందని ఆయన ఆరోపించారు. గతంలో ఢిల్లీకి విద్యుత్తును అందించిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన విద్యుత్ కంపెనీలలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపగా రూ.8 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ డబ్బును తమ ప్రభుత్వం వెనకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందని, ప్రస్తుతం ఈకేసు సుప్రీ కోర్టులో ఉందని తెలిపారు. ఈ కేసులో తాము విజయం సాధిస్తే ఢిల్లీలో మరింత విద్యుత్ టారిఫ్ ను తగ్గిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement