మద్యం మత్తులో మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్‌కు ప్రజలు దేహశుద్ధి చేశారు.
చెన్నై: మద్యం మత్తులో మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్‌కు ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సబర్బన్‌లో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఓమలూరు సమీపానగల అమరకుంది గ్రామవాసి ముత్తుసామి కుమారుడు మహేంద్రన్. చెన్నై సబర్బన్ సాయుధ దళంలో పోలీసు కానిస్టేబుల్‌గా మహేంద్రన్ పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య శారద ఉంది. 10 రోజుల కిందట శారద మగబిడ్డను ప్రసవించింది. బిడ్డను చూసేందుకు మహేంద్రన్ సెలవు తీసుకున్నాడు. ఈ క్రమంలో మహేంద్రన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు.
మహేంద్రన్ బృందం అరుపులతో ఇబ్బందికి గురైన అదే ప్రాంతానికి చెందిన మహిళలు మద్యం సేవించవద్దని సూచించారు. అందుకు మహేంద్రన్ తాను పోలీసునని, తననేమీ చేయలేరని తెలుపుతూ మహిళలను అసభ్యంగా దూషించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు స్థానిక ప్రజలకు ఈ విషయం తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న ప్రజలు అక్కడ మద్యం సేవించవద్దని, గొడవ చేయొద్దని చెప్పడంతో ఆగ్రహించిన మహేంద్రన్ వారిపై దాడికి యత్నించాడు. దీంతో గ్రామస్థులతో కలిసి మహిళలు మహేంద్రన్‌పై ఎదురు దాడికి దిగారు. తర్వాత అతణ్ని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులకు మహేంద్రన్‌ను అప్పగించారు.