కోడిగుడ్లు కోసం గొడవ.. ప్రియుడితో వివాహిత పరార్‌ | Woman Runs Away From Husband For Eggs In UP | Sakshi
Sakshi News home page

భర్త గుడ్లు తేవటం లేదని..

Oct 27 2019 12:52 PM | Updated on Oct 27 2019 1:07 PM

Woman Runs Away From Husband For Eggs In UP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆమె ప్రియుడు రోజూ గుడ్లు తెచ్చి ఇచ్చేవాడు...

లక్నో : తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో ఓ భార్య, భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని కంపేర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ ప్రతిరోజూ తినడానికి గుడ్లు తేవాలని భర్తతో గొడవపడేది. దినసరి కూలీ అయిన సదరు భర్త ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందుకు నిరాకరించేవాడు. దీంతో శనివారం మహిళ భర్తతో గొడవపడి ప్రియుడితో ఇంట్లోంచి పారిపోయింది. ఈ విషయంపై మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనో దినసరి కూలీని. నా ఆదాయంతో ప్రతి రోజూ కుటుంబానికి గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఈ బలహీనతను అలుసుగా తీసుకుని నా భార్య రోజూ గుడ్లు కావాలని గొడవపెట్టుకునేది. ఆమె ప్రియుడు ప్రతి రోజూ గుడ్లు తెచ్చి ఇచ్చేవాడు. అందుకే అతడితో పరారయింద’ని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement