కదులుతున్న కారులో అఘాయిత్యం | Woman Allegedly Gang-Raped In Moving Car In East Delhi | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారులో అఘాయిత్యం

Feb 28 2016 12:50 PM | Updated on Aug 1 2018 4:24 PM

కదులుతున్న కారులో అఘాయిత్యం - Sakshi

కదులుతున్న కారులో అఘాయిత్యం

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కదులుతున్న కారులో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆనంద్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రాత్రి 10 గంటల ప్రాంతంతో ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్ కు వెళ్లిన బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై దాడి చేశారు. తర్వాత ఆమెను మధు విహార్ లోని కడ్కీ మోడ్ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు.

నిందితులు, వారు ఉపయోగించిన కారును గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement