తేజ్‌ను కలిసిన ఐశ్వర్య, ఫోటో వైరల్‌ | When Tej Pratap Yadav Met Aishwarya Rai At Patna Airport | Sakshi
Sakshi News home page

తేజ్‌ను కలిసిన ఐశ్వర్య, ఫోటో వైరల్‌

Apr 10 2018 2:24 PM | Updated on Apr 10 2018 2:24 PM

When Tej Pratap Yadav Met Aishwarya Rai At Patna Airport - Sakshi

పట్నా : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతోంది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్‌ రాయ్‌ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్‌తో తేజ్‌ ప్రతాప్‌ పెళ్లి త్వరలో జరగబోతోంది. ఏప్రిల్‌ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. త్వరలో మనువాడబోతున్న తేజ్‌-ఐశ్వర్యలు ఆదివారం పట్నా ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన తండ్రి లాలూను కలిసి న్యూఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న తేజ్‌, ఐశ్వర్యను కలిసినట్టు తెలిసింది. 

ఈ ఇద్దరు కలిసి కొద్ది సేపు ఎయిర్‌పోర్టులో మాట్లాడుకున్న అనంతరం, ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐశ్వర్యతో పాటు ఆమె బంధువులు కూడా వారితో పాటు ఉన్నారు. తేజ్‌ను కలిసిన అనంతరం ఐశ్వర్య పెళ్లి షాపింగ్‌ కోసం ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కగా.. తేజ్‌ ఇంటికి చేరుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఏప్రిల్‌ 18న జరుగుతుండగా.. పెళ్లి మే 12న పట్నా వెటర్నిటీ కాలేజీ గ్రౌండ్‌లో జరగబోతోంది. వందల మంది వీవీఐపీల ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, ఆయన మంత్రి వర్గ సభ్యులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి.  

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement