ఇంతకీ యోగా దినోత్సవం ఖర్చెంత? | what is the expenditure of international yoga day | Sakshi
Sakshi News home page

ఇంతకీ యోగా దినోత్సవం ఖర్చెంత?

Jun 21 2016 8:11 AM | Updated on May 29 2019 2:58 PM

ఇంతకీ యోగా దినోత్సవం ఖర్చెంత? - Sakshi

ఇంతకీ యోగా దినోత్సవం ఖర్చెంత?

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మోదీ సర్కారు దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇంతకీ దీనికి ఖర్చు ఎంతవుతోందన్న విషయం ఎవరికైనా తెలుసా?

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మోదీ సర్కారు దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇంతకీ దీనికి ఖర్చు ఎంతవుతోందన్న విషయం ఎవరికైనా తెలుసా? గత సంవత్సరం పెట్టిన ఖర్చుకంటే చాలా తక్కువ మొత్తంలోనే ఈ సారి ఖర్చు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. అందులోనూ బాబా రాందేవ్ లాంటివాళ్లు నిర్వహించే యోగా కార్యక్రమాల ఖర్చును తాము భరించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 21 యోగా సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు కూడా కేంద్రం నిధులు ఏమీ మంజూరు చేయడం లేదట. అయితే ఆయుష్ శాఖ మాత్రం తన పద్దులోంచి రూ. 20 కోట్లను ఖర్చుపెడుతోంది. అందులో సగం మొత్తం ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ఇతర ప్రత్యేక క్యాక్రమాల కోసం ఖర్చుచేస్తోంది. ఇక కేంద్రం అయితే ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్న టీషర్టులు, టోపీలు, చాపల లాంటి వాటి కోసం మాత్రమే డబ్బులు ఇస్తోందట. గత సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రూ. 32.5 కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారహక్కు దరఖాస్తు ద్వారా తెలిసింది. అయితే, ఈసారి బడ్జెట్ మాత్రం దానికంటే చాలా తక్కువగా ఉండబోతోంది.

ఐక్యరాజ్యసమితిలో మొత్తం 193 దేశాలున్నాయని, వాటిలో లిబియా, యెమెన్ తప్ప అన్ని దేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో 57 మంది కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోను, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నోలోను పాల్గొంటున్నారు. ఒక్క యూపీలోనే దాదాపు 10 మంది వరకు కేంద్రమంత్రులు యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement