ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం: నితీశ్‌కుమార్ | We will support to a AP special status: Nitish Kumar | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం: నితీశ్‌కుమార్

Mar 15 2016 2:09 AM | Updated on Jul 18 2019 2:17 PM

ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం: నితీశ్‌కుమార్ - Sakshi

ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం: నితీశ్‌కుమార్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. జాతీయ నాయకుల మద్దతు కూడగట్టేందుకు ఏపీసీసీ బృందం సోమవారం ఇక్కడ జేడీయూ నేత శరద్‌యాదవ్‌ను కలిసేందుకు రాగా.. అక్కడే నితీశ్‌కుమార్ కూడా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ డిమాండ్‌కు మద్దతిస్తామని తెలిపారు.  పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి లేవనెత్తుతామని శరద్‌యాదవ్ చెప్పారు.

 కొత్త ప్రభుత్వం గౌరవించాలి: పవార్
 ఏపీకి హోదా విషయంలో పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం గౌరవించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఏపీసీసీ బృందం ప్రత్యేక హోదా పై మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఏపీసీసీ బృందం సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కూడా కలసి హోదాపై మద్దతు కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement