సివిల్‌ సర్వీస్‌లకు మరో 66 మంది

UPSC recommends 66 more candidates to civil services - Sakshi

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీలో భాగంగా  మరో 66 మంది పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేశారు. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ తదితర సర్వీసుల భర్తీకి మొత్తం 1,058 ఖాళీలకు 990 మందికి నియామక పత్రాలిచ్చారు. తాజాగా రిజర్వ్‌ జాబితాలో ఉంచిన మరో 66 మందిని యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో జనరల్‌ 48, ఓబీసీ 16 మంది ఉండగా, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరి వివరాలు యూపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top