నితీష్‌ వ్యాఖ్యల నిగ్గుతేల్చాలన్న కేంద్ర మంత్రి..

upendra Kushwaha wants BJP President Amit Shahs Intervention For Resolving JDU RLSP Tiff - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ ముఖ్యమం‍త్రి నితీష్‌ కుమార్‌ తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని కేంద్ర మంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం రాష్ర్టీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తక్షణం జోక్యం చేసుకుని పరిష్కరించాలని కుష్వాహ డిమాండ్‌ చేశారు. బిహార్‌ సీఎం చేసిన వ్యాఖ్యల అంతరార్ధంపై నిగ్గుతేల్చేందుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షం అధిపతిగా అమిత్‌ షా జోక్యం చేసుకుని సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

2020 తర్వాత సీఎంగా కొనసాగేందుకు నితీష్‌ కుమార్‌ సుముఖంగా లేరన్న కుష్వాహ వ్యాఖ్యలపై నితీష్‌ స్పందించిన తీరును ఆయన తప్పుపడుతున్నారు. చర్చను దిగజార్చే స్ధాయికి తీసుకొచ్చేందుకు అనుమతించమని నితీష్‌ వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి గెలిపించేందుకు కొన్ని ఎన్డీఏ పక్షాలు ఆసక్తికనబరచడం లేదన్న కుష్వాహ వ్యాఖ్యలతో జేడీ(యూ) చీఫ్‌కు, ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధినేతకు మధ్య విభేదాలు నెలకొన్నాయి.

దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నానని కుష్వాహ చెప్పుకొచ్చారు. తనపై బీజేపీ అధిష్టానానికి విష ప్రచారానికి పాల్పడుతున్న వారి ఏలుబడిలో బిహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top