త్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల క్షీణతకు కారణమైన మధుర, కైరానా, దాద్రి ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి ప్రత్యేక నివేదిక సమర్పించారు.
రాష్ట్రపతికి నివేదిక పంపిన గవర్నర్
Jul 11 2016 12:46 PM | Updated on Sep 4 2017 4:37 AM
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల క్షీణతకు కారణమైన మధుర, కైరానా, దాద్రి ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి ప్రత్యేక నివేదిక సమర్పించారు. ప్రధానమంత్రి, హోంమంత్రికి సైతం నివేదికలను పంపినట్టు గవర్నర్ వెల్లడించారు. ఈ నివేదికలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా దాటవేశారు.
కాగా గతేడాది దాద్రి గ్రామంలో అఖ్లాక్ అనే ముస్లిం ఇంట్లో ఆవు మాంసం ఉందనే అనుమానంతో గ్రామస్థలు దాడి చేసిన ఘటనలో అతను మృతి చెందాడు. ముస్లీం మెజారిటీ గ్రామం అయిన కైరానా లో 360 హిందూ కుటుంబాలకు చెందిన వారు వలస వెళ్లారు. ఆక్రమణ దారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే ఘటనలో భాగంగా పోలీసులకు, ఆందోళన కారులకు,పోలీసులకు మధ్య జరిగిన ఘర్షనలో 24 మంది మృతి చెందగా 100 మంది గాయపడిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement